Saturday, October 24, 2020
Home Articles వలస కూలి...కులాడు

వలస కూలి…కులాడు

ఏప్రిల్ 1 బీహార్ కి పది కిలోమీటర్ల ముందు నేషనల్ హైవే 44 లో మిట్టమధ్యాహ్నం ఒక శవం  అనాధగా పడి ఉంది పోలీసులు వచ్చి వాడి ఆధార్ కార్డు చుస్తే  వాడి పేరు నారాయణ బీహార్ రాష్ట్రం వాడు హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చే వలస కూలి.  సిటీలో నిర్మిస్తున్నా 40 అంతస్తుల మేడ కట్టడానికి వచ్చిన వలస కూలీ. 5 రోజుల క్రితం ఏం జరిగిందంటే నారాయణ కి నడిచి నడిచి కాళ్లు నొప్పులు వచ్చాయి కిలోమీటర్లు దాటిన తర్వాత వాటిని లెక్క వెయ్యటం  మానేశాడు ఇంటికి వెళ్లాలని ఉంది , అమ్మ గుర్తొస్తుంది ఆకలిగా ఉంది ,డొక్కలో నొప్పి,కాళ్ళ నొప్పి కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు మీద రక్తపు మరకలు కనబడ్డాయి అవి అతని ముందు మనుషులవి దేవుడా ఎందుకు చేసావు దేవుడా అని దేవుడికి ప్రశ్నలు ,దేవుడు దగ్గర నుంచి  సమాధానం రాలేదు.

అలా నడుచుకుంటూ సాయంత్రం అయిపోయింది దూరంగా ఎవరో ఒక అమ్మాయి రోడ్ పక్కనే ఉంది చూస్తుంటే రాత్రుళ్ళు ప్రసన్నం చేసుకునే మనిషిలాగ ఉంది , తన దగ్గరకి వెళ్తే మొహం పీక్కు పోయి ఉంది ఒంట్లో రక్తం చుక్క లేదు కానీ ఆ పనికి తయారు అయింది ఏంచేస్తుంది ఆకలి ఆకలి అదే అన్ని చేయిస్తుంది , నారాయణ ఆ అమ్మాయి దగ్గరకి వెళ్లి నాకుని  శరీరం వద్దు నీ మూటలు నే బరువులు ఉంటె ఇవ్వు నేను మోస్తాను అని అన్నాడు.

వెంటనే తన కంట్లో కన్నీళ్లు ప్రస్తుతానికి అడగకుండా వచ్చేవి అవే, ఇద్దరు ఆ రాత్రి ఒక మామిడి చెట్టు దగ్గర చేరి ఎవరికి కనపడకుండా ఒక మామిడి కాయని తెంపి తిన్నారు , నారాయణ , తను కలిసి ఆ రోజు చందమామ వెలుగును నడకసాగించారు అలసి అక్కడే పెట్రోల్ బంక్ దగ్గర నిద్రపోయారు  , తెల్లవారే లేవాలి మళ్ళీ నడక ఎండన పడ్డారు ఎండకి యాటై(మాంసం) పోతున్నారు , ప్రభుత్వం ఆ రోజే మందుషాప్లు తెరిచారు అని ప్రకటన వచ్చేసారి ఊరిలో వాళ్ళు పచ్చి బానిసనులు అవ్వడం వల్ల వందల మంది షాప్కి దారి  కట్టారు , నారాయణ మూట పక్కన పెట్టి కూలబడితే , ఆ అమ్మాయి అప్పుడే వైన్ షాప్ దగ్గరకి వెళ్లి మంచి నీళ్లు అడిగింది , పో…బయటకి ..పో అని షాప్ వాడు ఈసడించుకున్నాడు వాడికి ఖద్దరు చొక్కా వాడే కావాలి మాసిన బట్టలు చుస్తే వాడికి మంట , పచ్చి  బానిసలూ ఆ షాప్ మీద పడి లూటీ చేస్తున్నారు , దొరికన వాడు దోరికినట్లుగ లూటీ చేస్తున్నారు , ఆ తొక్కిసలాటలో దాహం తీర్చుకోవటానికి వెళ్లిన అమ్మాయి చనిపోయింది.

నారాయణ నోటా మాట లేదు , మధ్యలో పరిచయం , అది ఒక్కరోజే , కానీ ఎందుకో నారాయణ ఏడ్చేశాడు ఆ అమ్మాయి కలిసినప్పుడు ఏడ్చింది వీడు లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడు , చక్కగా ఉరి జనం మందు షాపు లూటీ చేసి గొంతు నిండా తాగేశారు , జ్ఞాపకాల నడక అయిపోయింది ఇప్పుడు నారాయనికి  ఎండ లేదు చెమట లేదు ఏమి లేదు గుడ్డిగా వెళ్తున్నాడు.

ఐదో రోజు 10 కిలోమీటర్ల దూరం లో ఉండగా ఇంకో ప్రకటన నిబంధనలు సడలించండం  దొరికిందే సందు అని  MLA కొడుకు వాడి స్నేహితుల్ని వేసుకుని రోడ్ మీద తాగేసి కార్ ఎలా పడితే ఆలా నడిపిస్తున్నాడు , మ్మ్మ్మ్మ్ పోనీ పోనీ అని వెనక ఉన్న కుర్రవాళ్ళ కేకలు , నారాయనకేమో కళ్ళు మసకలు వచ్చేసాయి నీరసం మీద తిండిపెట్టేవాడు ఉంటెగ  పూర్వం ఎప్పుడు కులం మతం అని విడదీశారు ఈరోజు వాళ్ళకి ఇంకో కారణం దొరికేసింది కరోనా రూపం లో ఇంకా ఎవడు దగ్గరకి ఎవడు వెళ్ళాడు దూరం పాటిస్తున్నారు , విచక్షణ కోల్పయిన MLA  కొడుకు తన కార్  ని నారాయణ మీద కి పోనిచ్చాడు , నారాయణ చనిపోయాడు రోడ్ మీద అనాధలాగా చివరికి ఇప్పుడు నారాయణ నారాయణ నారాయణ అని చివిలో చెప్పటానికి కర్మ చెయ్యటానికి ఎవడు లేదు…

ఎవడు రాడు, వాళ్ళ మేస్త్రి ఫోన్ చేసి రేయ్ ఏం బాధ వద్దులే సరుకులు పంపిస్తున్న ఇక్కడే తిని ఉండిపో అంటే బాగుండేదేమో , లేదు పెద్ద సారు గారు ఒక నెల నేను చూస్కుంటారా అంటే బాగుందేమో ఏమో ఏవి నిజం కాక రోడ్ ఎక్కాడు. ఎప్పుడూ వాళ్ళ ఊరిలో శ్రీ శ్రీ “ఒరేయ్ సిటీ లో పెద్దోళ్ళు 40 అంతస్తుల కట్టి అక్కడ నుంచి ప్రపంచాన్ని చూడాలి అనుకుంటారు వాళ్ళకి అవసరం అయితే మన మీద ఎక్కి ఆ సరదా తీర్చుకుంటారు తప్ప మన కష్టాన్ని పట్టించుకోరు అని ఎప్పుడో సెలవిచ్చాడు ,ఏంచేస్తాడు నగరానికి వాడి యవ్వనాన్ని పెట్టుబడిగా పెడితే వాడికి చావుని పరిచయం చేసింది…

AN ARTICLE BY SACHA..alias Satish Chandra

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Nostalgic Short Films every short film lover can relate to…

Manakai chala chinni crazy ideas osthuntai , kani anni pedha films kalevu .Oka idea practical form loki ravalante chala pattudhala hard work kavali ,...

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు - గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్ తెలుగు, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ద్రవిడ భాషలలో ఒకటైన తెలుగు, ఉన్న నాలుగు ద్రవిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష....

10 underrated places that define the vibe of Hyderabad

Some random Person: abba Hyderabad overrated ra sami , a Charminar , Tank bund , Golconda danni pattukuni m Hyderabad goppa ante ma Hyderabad...

Nisheedi Mounam Aksharamaithe

Jeevitham tho Mounam ga Yuddam chesthunna oh, Manishi Manasu Katha... Manam chudaley kani Mana chuttu unna Manam chudaleni Yuddam chesthunna chala Mandi Manushula Manasuloni katha...   'Ah Nidra Rani Artha...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak