Tuesday, October 20, 2020
Home Articles సరదా కబుర్లు - భాగం: 1

సరదా కబుర్లు – భాగం: 1

హేమ చెన్నై లో ఉంటాడు వాడి ఫ్రెండ్ ప్రణయ్ హైదరాబాద్ లో ఉంటాడు వాళ్ళ మధ్య జరిగే ఫోన్ సంభాషణలు.
ఒకరోజు రాత్రి హేమ మందేస్తూ ఫస్ట్ పెగ్గు లో ఉన్నాడు ప్రణయ్ కి ఫోన్ చేసాడు ప్రణయ్ అప్పటికే సెకండ్ పెగ్గు వేసేసి ఉన్నాడు.
రేయ్ ఎందుకురా ప్రణయ్ ఎప్పుడూ తన గురించే చెప్తావ్?. “ఏదో అలవాటైపోయింది  హేమా బాగా అలవాటు పడిపోయా “, నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్తుంటే తనని  ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది ,అసలు ఆ అమ్మాయి నిజంగా ఉందా? అన్న డౌట్ కూడా వేస్తుంది నాకు  “పెద్ద సినిమా హీరోయిన్ కాదు కానీ  నేను సైట్ కొడుతుంటే నన్ను హీరోని చేస్తుంది” బానే చెప్తున్నావ్ రా  కబుర్లు “రేయ్ హేమ మానవుల పురాతనంగా చాల కనిపెట్టారు అందులో  ప్రేమ కూడా ఒకటి  అగ్ని ఎలా కనిపెట్టాడో ప్రేమ కూడా అంతే “
love is an ancient practice of Human”. Hmm  ఇంకా చెప్పురా ఆ అమ్మాయి గురించి ఎప్పుడైనా నీతో పక్కన కూర్చుని మాట్లాడిందా ? “లేదురా”  పోనీ ఎప్పుడన్నా? నిన్ను ఒక్కసారైనా అలా ఒక రెండు నిమిషాలు చూసిందా?? “.
అస్సలు చూడను కూడా చూడదు” ఏమైందిరా ప్రణయ్ నీకు ??”రేయ్   మీరందరూ నిద్రపోయిన తర్వాత వస్తుంది రా నా కల్లోకి అప్పుడు చూస్తుంది  సూర్యూదయం దాకా ఉంటుంది “. ఓహో పొద్దున్నే లేచి ఆఫీస్కు పోతుందా ? ఓకే ఇంకా  చెప్పు తన గురించి లతా మంగేష్కర్ ల పడుతుందా? ” మ్మ్ పాడుతున్నప్పుడు నిశ్శబ్దం కూడా నాకు వినాలి అనిపిస్తుంది”.
ఎందుకనిపించదు అనిపిస్తుంది అనిపిస్తుంది, “హేమ నీకో విషయం తెలుసా తను ఒకసారి ఏదో విషయం మీద కంప్యూటర్ ల్యాబ్ లో నా ముందు ఏడ్చిందిరా  అప్పుడు ఆ రోజు కాసేపు కృష్ణ నది లోని నీళ్లు  తన కళ్ళలోకి వచ్చి వెళ్లాయి.అంటే తాను అంత బాగా ఏడ్చింది అన్న మాట “రేయ్ మీ వదిన నా ముందు ఏడ్చింది రా ” అవును so sad మా వదిన నీ ముందు ఏడ్చింది “అప్పుడు ఒక కవిత రాసాను”
మీట మీట లాడే సూర్యుడు తన బుగ్గల మీదకు వచ్చాడు
నది లోని నీళ్లు కాసేపు నా కళ్ళలో ఉన్నాయ్ ,నది కలతప్పింది
ఏడుస్తుంటే తెలిసింది నవ్వుతున్నప్పుడు బాగుండేది అని
The creativity comes from Persuasion అని అంటారు నిజమే “తానే కానక మీ వదిన ఐతే మీకు జీడీ పప్పు ఉప్మా చేసి పెడుతుంది రా ” . మొన్న అడిగితె టీ ఒక్కటే పెట్టటం వచ్చు అని చెప్పింది అన్నావ్ ?? “జోకులు వేస్తె నీకు అది కూడా ఇవ్వదు బాగా స్ట్రిక్ట్ రా బాబు ” .
ఇంకేంట్రా ఆ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్  లో ఉంటుంది అన్నావ్ ఎప్పుడన్నా కలిసావా?? ఎప్పుడన్నా మాట్లాడటానికి ట్రై చేసావా?? అంటే బ్లాక్ చేసింది అన్నావ్ మళ్ళీ ఏమన్నా ??? ” ఇంకా లేదు we cant make miracles happen , they happen ఇంతకన్నా మందు లో నేను మాట్లాడలేను , ఈసారి నీ వీకెండ్ లో మాట్లాడుకుందాంలే  ఉంటాను…
రేయ్ ప్రణయ్ రేయ్ ప్రణయ్ , మీరు సంప్రదిస్తున్న వినియోగ దారుడు అందుబాటులో లేడు , ప్రణయ్ ఫోన్ switch off , ప్రణయ్ తాగేసి పడిపోయాడు , హేమ ఇంకా మూడో పెగ్గులోనే ఉన్నాడు .
రచన : సచ (సతీష్ చంద్ర)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Nostalgic Short Films every short film lover can relate to…

Manakai chala chinni crazy ideas osthuntai , kani anni pedha films kalevu .Oka idea practical form loki ravalante chala pattudhala hard work kavali ,...

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు - గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్ తెలుగు, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ద్రవిడ భాషలలో ఒకటైన తెలుగు, ఉన్న నాలుగు ద్రవిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష....

10 underrated places that define the vibe of Hyderabad

Some random Person: abba Hyderabad overrated ra sami , a Charminar , Tank bund , Golconda danni pattukuni m Hyderabad goppa ante ma Hyderabad...

Nisheedi Mounam Aksharamaithe

Jeevitham tho Mounam ga Yuddam chesthunna oh, Manishi Manasu Katha... Manam chudaley kani Mana chuttu unna Manam chudaleni Yuddam chesthunna chala Mandi Manushula Manasuloni katha...   'Ah Nidra Rani Artha...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak