Tuesday, October 20, 2020
Home Articles 10 Life lessons beautifully written by Siri Vennela Sitarama Sastry garu

10 Life lessons beautifully written by Siri Vennela Sitarama Sastry garu

1. Mari Anthaga – SVSC

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల..
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల.
చమటలేం చిందించాలా.. శ్రమపడేం పండించాలా.. పెదవిపై చిగురించేలా.. చిరునవ్వులు..
కండలను కరిగించాలా.. కొండలను కదిలించాలా.. చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు…
మనుషులనిపించే ఋజువు.. మమతలను పెంచే ఋతువు..
మనసులను తెరిచే హితవు.. వందేళ్ళయినా వాడని చిరునవ్వు

SVSC

2. Thakita Thadimi – Sagara Sangamam
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన

Sagara Sangamam

3. Ne Tholisariga – Santhosham

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా
నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా…
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా…

Santosham

4 Chal Chalo Chalo – S/O Satyamurthy
తీపితో పాటుగా ఓ.. కొత్త చేదు
అందించడం జిందగీకీ అలవాటే…
కష్టమే రాదనే గారెంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకొ హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
ఛల్ ఛలో ఛలో…

Son of Sathyamurthy

5 Santhosham Sagam Balam – Chirunavvutho

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల
నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా
అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని
తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో
తరిమెయ్యవే చిలకమ్మా

Chirunavutho

6.Tarali Rada – Rudra Veena

పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం

Rudraveena

7.Life of Ram – Jaanu

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా..విన్నారా..
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా…

Life of Ram

8.Nee prashnalu neeve – Kotha Bangaru Lokam

పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా

Kotha Bangaru Lokam

9.Entha Varaku – Gamyam

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మది భాష్యము
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కాని…

Gamyam

10. Chesedhedho – Mukunda

స్పష్టానంగా పోల్చుకో,
శక్తుందా తేల్చుకో,
అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా ఓహో,
కష్టాలే ఓర్చుకో ఇష్టాంగా మార్చుకో,
అడుగడుగునా ఏ మలుపేల పడగొడుతున్న ఓహో,
కళలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అద్దని,
నమ్మకం నిజమాయె లోపుగా,
తప్పని నొప్పి ఉందని,
ఆకలే వేటగ మార్చటం కాలం అలవాటని
గమనించే తెలివుంటే
ప్రళయాన్ని ప్రణయం అనవా..
పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన
అర్ధం ఉన్న ఓ
పదము కానిదే అర్ధముందున
నీది అన్న నిర్వచనం ఇచ్చుకో
జీవితానికి ఎం చేసిన…

Mukunda

– An article by Deepak Moses Nella

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Nostalgic Short Films every short film lover can relate to…

Manakai chala chinni crazy ideas osthuntai , kani anni pedha films kalevu .Oka idea practical form loki ravalante chala pattudhala hard work kavali ,...

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు - గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్ తెలుగు, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ద్రవిడ భాషలలో ఒకటైన తెలుగు, ఉన్న నాలుగు ద్రవిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష....

10 underrated places that define the vibe of Hyderabad

Some random Person: abba Hyderabad overrated ra sami , a Charminar , Tank bund , Golconda danni pattukuni m Hyderabad goppa ante ma Hyderabad...

Nisheedi Mounam Aksharamaithe

Jeevitham tho Mounam ga Yuddam chesthunna oh, Manishi Manasu Katha... Manam chudaley kani Mana chuttu unna Manam chudaleni Yuddam chesthunna chala Mandi Manushula Manasuloni katha...   'Ah Nidra Rani Artha...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak