Tuesday, May 26, 2020
Home Articles అయ్యో పాపం ఎ.పి పోలీసులు...

అయ్యో పాపం ఎ.పి పోలీసులు…

వలస కూలీలపై విరిగిన లాఠీ….ముఖ్య మంత్రిపై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్ష పెద్దాయన.

లాఠీలతో కొట్టి, చేతులు విరిచికట్టి డాక్టరుపై పోలీసుల క్రూరత్వం.ముఖ్య మంత్రిపై విరుసుకు పడ్డ ప్రతిపక్ష పెద్దాయన.
*
ఈ రెండు సంఘటనల వీడియోలలో ఉన్నదాని ప్రకారం… వలస కూలీలపై లాఠీ చార్జీ జరగలేదు. గుంపుగా వస్తున్న వారిని దూరంగా పంపటానికి, బెదిరించే ప్రయత్నంగా… లాఠీ చార్జీ చేస్తునట్టుగా, వేగంగా కదిలి, లాఠీతో కూలీ బాగ్ పైన ఒక పోలీసు కొట్టాడు.

డాక్టరు గారు పూటుగా తాగి… మాస్క్ లేకుండా, కారు నడుపుతూ…మతాలను, ప్రభుత్వ పెద్దాయన్ను , పోలీసులను బండ బూతులు తిడుతుంటే… వీడియో తీయటం మాత్రమే చేయగలిగే స్తితిలో ట్రాఫిక్ పోలీసులు ఉండి పోయారు. వాకీటాకీలో శాంతి భద్రతల పోలీసులకు సమాచారం యిస్తున్న దృశ్యం కూడా ఉంది.

డాక్టరును చేతులు విరిచి కట్టుచున్న దృశ్యానికి ముందు ఏమి జరిగిందో వీడియోలో లేదు (బహుశా ఎడిట్ చేసి ఉంటారు) అక్కడ డాక్టర్ గారు పోలీసులను బాగా ఇబ్బంది పెట్టెలా ప్రవర్తించి ఉండవచ్చు… ఆ కొనసాగింపులో, ఒక పోలీసు తన వద్ద ఉన్న ప్లాస్టిక్ లాఠీతో చిన్నగా ఒక దెబ్బ వేసిన దృశ్యం ఉంది.

ఇక్కడ పోలీసులు క్రూరంగా ప్రవర్తించడం, హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం… ఈ దుర్మార్గపు సంఘటన ప్రభుత్వాన్ని వూపేయటం లాంటివి ఏమీ లేవు. ఉంటే… ప్రభుత్వ డాక్టర్ మధ్యం తాగి… కారు నడుపుతూ, సిగరెట్టు కాలుస్తూ, పోలీసులను ముఖ్య మంత్రులను బండబూతులు తిడుతూ, లాక్ డౌన్ నియమానాలు అతిక్రమించడంలోనే ఉన్నాయి.

ఇవి…ప్రతిపక్ష పెద్దాయనకు ఒకటి, రెండు రోజుల రాజకీయ ఉపాది కొరకు మరియు ప్రభుత్వాలను తప్పు పట్టటానికి మాత్రమే ఉత్సాహం చూపే నెట్ జనులకు ఉపయోగపడే రచ్చ అంశాలు మాత్రమే.

కానీ… విశాఖ సి.పి, ఒక పోలీసును సస్పెండ్ చేస్తునట్టు ప్రకటించటం మాత్రం తప్పుడు చర్య. పోలీసుల పనితీరు మరింత నిర్వీర్యం అవ్వటానికి ఈ చర్య పనికి వస్తుంది.

కరోనా విపత్తులో… సెలవులు లేకుండా, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న పోలీసులను జనం పూలుచల్లి కొద్ది రోజుల క్రితం అభినందించారు. కానీ… రాజకీయ మైలేజీ కొరకు తపించే వారి ప్రచారానికి కొందరు నెట్ జనులు ప్రభావితం అయి తందానా అనటం సరికాదు.

15 సంవత్సరాల క్రితం రోజుల్లో ఎవరైనా ఇలా పోలీసుల పట్ల ప్రవర్తించి ఉంటే… గుట్టు చప్పుడు కాకుండా లాకప్ డెత్ అయ్యెవాడు. నాలాంటి వాడు ఇప్పుడు అక్కడ పొలీసుగా ఉండి ఉంటే… ఆ డాక్టరు తిట్లకు సమాధానం లాకప్ డెత్ రేంజ్ కాకున్నా… దాదాపుగా ఆ స్తాయిలోనే ఉండేది.

—మాదివాడ రామబ్రహ్మం, జన విజ్ఞాన వేదిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

చీకటి మృత్యువు…A Song on the present situation

పల్లవి: చీకటింక పోలేదు వెలుతురింక రాలేదు తెల్లారకముందే బతుకు తెల్లవారేను ఈ రసాయన భూతం మృత్యువై వచ్చేను నిదురలోనె ప్రాణాలను మింగివేసె నేడు చ.1 కరోనతోటి యుద్ధంలో ఇంటివద్దనే ఉంటే మృత్యువే రూపు మార్చి ప్రాణాలే తీసెను ఊపిరాగి స్పృహ పోయి లేవలేని జనాలు చివరిమాట...

శిష్యా ! ఈ రోజు ఎవరూ తమ సమస్యలు వ్రాయలేదా ?

మీ శిష్యుడు ఒకరు తమ దంపతుల సమస్య మెసేజ్ చేశాడు గురువు గారూ. ఏమిటట సమస్య చదవండి? " గురువు గారి పాదపద్మములకు వందనాలు, అయ్యా మా దంపతుల మధ్య ఈ మధ్య ఎక్కువగా గొడవలు వస్తున్నాయి, దీనికి...

అయ్యో పాపం ఎ.పి పోలీసులు…

వలస కూలీలపై విరిగిన లాఠీ....ముఖ్య మంత్రిపై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్ష పెద్దాయన. లాఠీలతో కొట్టి, చేతులు విరిచికట్టి డాక్టరుపై పోలీసుల క్రూరత్వం.ముఖ్య మంత్రిపై విరుసుకు పడ్డ ప్రతిపక్ష పెద్దాయన. * ఈ రెండు సంఘటనల వీడియోలలో ఉన్నదాని...

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా ప్రముఖ హీరో తరుణ్…

కరోనా వల్ల ప్రేక్షకులు వినోదానికి చాలా రోజుల నుంచి దూరం అయ్యారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇప్పట్లో సినిమాలు రిలీజ్ కావు, సీరియల్స్ ప్రచారం చేయరు, డాన్స్ షో లు నిర్వహించరు...

Recent Comments

Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak