Tuesday, May 26, 2020
Home Articles శిష్యా ! ఈ రోజు ఎవరూ తమ సమస్యలు వ్రాయలేదా ?

శిష్యా ! ఈ రోజు ఎవరూ తమ సమస్యలు వ్రాయలేదా ?

మీ శిష్యుడు ఒకరు తమ దంపతుల సమస్య మెసేజ్ చేశాడు గురువు గారూ.

ఏమిటట సమస్య చదవండి?

” గురువు గారి పాదపద్మములకు వందనాలు,
అయ్యా మా దంపతుల మధ్య ఈ మధ్య ఎక్కువగా గొడవలు వస్తున్నాయి,
దీనికి ఏమైనా మీరు సూచన చేసి, మా మధ్య మంచి రిలేషన్ ఉండేలా చేయగలరా ? ” , ఇదీ వారి సమస్య.

మంచి ప్రశ్న అడిగారు వారు,
ఇది చాలామంది ఇళ్లలో ఉన్న సమస్యే,
దీనికి మన దగ్గర అద్భుతమైన రెమెడీ ఉంది చెప్తాను నాయనా..

రెండు ఇలాచీలు గ్రీన్ కలర్ లో 9 mm ఉండాలి, వాటిని దంపతులు నిద్రపోయే ముందు వారి దిండు క్రింద పెట్టాలి,
ఉదయం లేచిన తర్వాత ఆ ఇలాచీ లను జాగ్రత్తగా తీసుకుని కాఫీ లేదా టీ లో ఎవరి ఇలాచీ ని వారు కాకుండా మార్చుకుని అందులో వేసుకుని వేడి వేడిగా త్రాగాలి..
ఇలా 4 లేదా 5 రోజులు చేసిన తర్వాత వారి మధ్య ఎటువంటి గొడవలు రావు శిష్యా..

అదెలా సాధ్యం స్వామీ, అందులో ఉన్న లాజిక్ ఏంటి ?

ఇలాచీలలో Positive waves ఉంటాయ్, అవి వీళ్లు నిద్రలో వున్నప్పుడు ఆ రెండు ఇలాచీలు పనిచేయడం ప్రారంభిస్తాయ్.

రెండు ఇలాచీలు పరస్పరం తమ waves ని మార్చుకుంటాయ్,
ఉదయాన్నే ఆ దంపతులు త్రాగే కాఫీలోకి చేరి వారి ఇద్దరికి Positive waves ని అందజేసి ఇద్దరి మధ్య అన్యోన్యం కలిగేలా చేస్తాయ్..

స్వామీ మీ జ్ఞానం అమోఘం,

నాకెక్కడిదిరా జ్ఞానం, మీ అజ్ఞానమే మా జ్ఞానం ( మనసులో )

– శ్రీశ్రీశ్రీ తులసీరామస్వాముల వారు.

#పొరపాటున నమ్మేరు సుమీ #

–An article by Tulaseeram.G

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

చీకటి మృత్యువు…A Song on the present situation

పల్లవి: చీకటింక పోలేదు వెలుతురింక రాలేదు తెల్లారకముందే బతుకు తెల్లవారేను ఈ రసాయన భూతం మృత్యువై వచ్చేను నిదురలోనె ప్రాణాలను మింగివేసె నేడు చ.1 కరోనతోటి యుద్ధంలో ఇంటివద్దనే ఉంటే మృత్యువే రూపు మార్చి ప్రాణాలే తీసెను ఊపిరాగి స్పృహ పోయి లేవలేని జనాలు చివరిమాట...

శిష్యా ! ఈ రోజు ఎవరూ తమ సమస్యలు వ్రాయలేదా ?

మీ శిష్యుడు ఒకరు తమ దంపతుల సమస్య మెసేజ్ చేశాడు గురువు గారూ. ఏమిటట సమస్య చదవండి? " గురువు గారి పాదపద్మములకు వందనాలు, అయ్యా మా దంపతుల మధ్య ఈ మధ్య ఎక్కువగా గొడవలు వస్తున్నాయి, దీనికి...

అయ్యో పాపం ఎ.పి పోలీసులు…

వలస కూలీలపై విరిగిన లాఠీ....ముఖ్య మంత్రిపై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్ష పెద్దాయన. లాఠీలతో కొట్టి, చేతులు విరిచికట్టి డాక్టరుపై పోలీసుల క్రూరత్వం.ముఖ్య మంత్రిపై విరుసుకు పడ్డ ప్రతిపక్ష పెద్దాయన. * ఈ రెండు సంఘటనల వీడియోలలో ఉన్నదాని...

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా ప్రముఖ హీరో తరుణ్…

కరోనా వల్ల ప్రేక్షకులు వినోదానికి చాలా రోజుల నుంచి దూరం అయ్యారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇప్పట్లో సినిమాలు రిలీజ్ కావు, సీరియల్స్ ప్రచారం చేయరు, డాన్స్ షో లు నిర్వహించరు...

Recent Comments

Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak