Sunday, July 12, 2020
Home Articles Toxic Humanity

Toxic Humanity

ఏ మనిషి చేత చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి సమస్తం అకృత్యం, కుళ్ళు, కల్మషంమయం!!!

ఈ అక్షర పదాల మాల నా మానసిక్కోలాస శోధన కాదు
నేను దులిపేసుకుని దాటలేకపోతున్న నా అక్షరవేదన

మనుషులు అన్నాక తప్పులు సహజం… ఒకే జెండా పంచుకునే దేశంలో తోటి దేశస్థులని ప్రేమించాలి అని, ఇలాంటి కష్టకాలంలో ఐక్యత అవసరం అని అన్నారు కానీ…

ఒకరిని అభిమానిస్తే వారి లోపాలు, తప్పులని కూడా స్వీకరించాలి అంటారు కానీ… ఆ ఏనుగుకి  జరిగింది లోపం కాదు, తప్పు అసలే కాదు…
అసలు ఆ పాపానికి పేరు లేదు
జాతి మూలాల్ని ప్రశ్నించే ఒక లోతైన అగాధం
నాకు అబ్భిన భాష, నేర్పిన గురువు, ఒడిలోకి తీసుకున్న కాళీ; సరస్వతే కాదు…
నా ప్రేమ, ప్రకృతి, దైవం సైతం నేను నా అక్షరజ్ఞానాన్ని ఆ సంఘటన చేసిన మనిషికి చెందిన మానవజాతిని ఉద్దెశించి రాస్తున్నంత సేపు గ్రహణం పట్టి మౌనం పాటిస్తున్నాయి అయినా…. ఈ అక్షరవేదన తప్పదు.

ఆనందం పట్టినప్పుడో, నా ప్రేమ చల్లని తోడులో ఉన్నప్పుడో కడుపు నిండి ఏమీ తినాలని అనిపించదు అని తెలుసు కానీ…. ఇలాంటి సంఘటనల కల్మషం కూడా కడుపుని నింపేసి ఆకలిని కొంత కాలానికి చంపేయగలదు అని మరోసారి అర్థమైంది.
అంతేనా???
లేక… ఈ నా ఆహరం తినకపోవడం నా ఆత్మవంచనా??? ఆహారాన్ని ఎరగా చూపే కదా ఆ ఏనుగుకి గాయం చేసింది, దాని లోపల బిడ్డని హోలీ ఆడినట్టు రక్తస్రావంలా నీటిలో కలిపేసింది… అందువల్ల ఆహారాన్ని చూసినా, చేసినా, రుచించినా ఆ ఏనుగు తాలూకూ మనోవేదనకు నేను గురి అవుతానేమో అనే భయంతో… నన్ను నేను ఆహారానికి దూరం చేసుకుంటున్నానా అనేది కూడా అర్ధం కావట్లేదు.

వేటాడటం ఎలాగో తరతరాలుగా చేస్తున్నాం కానీ ఆహారాన్ని ఎరగా చూపి హింసించి చేవలేని పైశాచికానందాన్ని పొందేంత స్థాయికి మనిషి దిగజారిపోయాడా?!

హత్యని “ఆకలి అనే అవసరంకోసం వేటాడటంలో ఒక భాగం” అనే పరిస్థితి నుండీ యుద్ధం, విప్లవం లో సమన్యాయం అనే స్థాయికి తీసుకెళ్లిన మనిషి అనే జాతి లో పుట్టిన కొందరు జాతిరత్నాలు తోటివారికోసమో, వాడు నడిచే వాడి గుంపు అంగీకారం కోసమో, ఆటవిడుపు కోసమో మూగ జీవాన్ని హత్య చేసే స్థానానికి మానసికంగా దిగజారిపోతున్నారు అంటే…. ఇప్పటి ఈ మానసిక “అభివృద్ధి” ఆహారం తినే నోరుతో మలాన్ని విడిచి మలద్వారంతో ఆహారాన్ని తీసుకోవటంతో సమానం!!!

చంపేవాళ్లు చంపటానికి అవకాశాలు వెతుకుతూనే ఉంటారు
తోటివారి ఆత్మవిస్వాసాన్ని చంపేవాళ్లు
తోటివారి నమ్మకాన్ని చంపేవారు
పక్కవారి కలలను, కళలను, అభిమానాన్ని
ఇలా కనిపించని, కొలమానం లేని వాటిని చంపటానికి మనిషి ఎప్పుడూ ఎదో ఒక సాకు, సాధనం, అవకాశం వెతుకుతూనే ఉంటాడు కానీ… ప్రస్తుతం చుట్టూ ఉన్నవారి దృష్టిలోపం గురించి మాట్లాడుకోవాలేమో…

ఏ న్యాయస్థానానికీ చేరలేని ఇలాంటి నేరాలని చూడకుండా ఉండటానికే ఏ మహనీయురాలో న్యాయదేవత కళ్ళకి ముసుగువేసిందేమో చూడు!!!

ఎందుకంటే అసిఫా లాంటి చిన్న పిల్లో, అయేషా – నిర్భయ – దిశా నో చనిపోలేదు… చట్టం చేసి చేతులుదులుపుకోటానికి; రాజధాని పురవీధుల్లో కొవ్వొత్తులదేశప్రేమని కరిగించడానికి. ఆ బిడ్డని కోల్పోయిన ఏనుగు చనిపోయినా దాని కన్నీరూ, రక్తస్రావం సంధించే నిశ్శబ్దప్రశ్నలని దిక్కులుచూస్తూ తప్పించుకోవచ్చు కానీ… లోపల నుంచీ మనస్సు సంధించే ప్రశ్నలని ఏ దిక్కులో దాక్కుని తప్పించుకోవాలి? కరుడుగట్టిన నేరస్థులు నిత్యం మనిషిలోనే ఉంటారు… అంతరించిపోయే జీవులందరూ ఆ లోలోపలి నేరస్తుడి బాధితులే అనేది అందరూ గమనించాల్సిన గాయపరిచే నిజం.

ఇలాంటివన్నీ అనేక రకాలుగా అనుభవంలోకి వస్తుంటే అనిపిస్తోంది బహుశా… మనమందరం ఎంతోకొంత భాగస్థులం ఇలాంటి నేరాలకు అని…

మనిషిని ఆడది కంటే…
నేరస్తుల్ని సంఘం కంటోందా?!!

ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, జడ్జ్ చేయటం దగ్గరనుండీ… కంపెనీ పెట్టి విషపు గ్యాస్ లీక్ చేసి సామూహిక హత్యలు చేయటం, అకౌంటబిలిటీ లేని – రాని మూగజీవాలని ఆటవిడుపుగా చంపటం వరకు… అన్ని ఏవో ఎక్కడో లోపాలు గానో.. మ్యానుఫ్యాక్చరింగ్ డెఫెక్టులగానో కనిపిస్తున్నాయి కానీ…. దూరం నుండి చూస్తుంటే… ప్రతి దానికి మరోదానితో సంబంధం ఉంది అని అనిపిస్తుంటే మాత్రం… అలోచించి అడుగువేసే స్పృహ ని ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా కోల్పోయామా అని స్వీయనిర్బంధమో శాశ్వతనిర్బంధమో జరుగుతూనే ఉండాలా అనే ప్రశ్న వేటాడుతోంది…

ప్రతీ 100 ఏళ్ళకి ఒక అంటువ్యాధి వస్తోంది కానీ… అంటు వ్యాధులు ఎంతో కొంత అలవాటు అయినట్టు… నిర్లక్ష్యం, భేదభావం, చులకన కూడా అలవాటు అయిపోయాయా???

ఆ ఏనుగుకి ఎదురైంది ఏ హత్యకి, మానభంగానికి, సాంఘిక దురాచారాలకు తక్కువ???
అదీ హత్యే కదా… మానభంగమే కదా… ఎందరో స్వాతంత్రసమార యోధులు ఈ నేలనుండీ పారద్రోలాలనుకున్న దురాచారాలలో అదీ ఒకటి కాదా? పిడికెడు రక్తం చిందిస్తే స్వేచ్చని ఇస్తా అన్న నేతాజీ… ఇలా ఇష్టమొచ్చిన్నట్లు కనిపించని, కనిపించే వాటిని చంపుతూ రక్తాన్ని కార్చగలుగుతున్న దేశస్వేచ్ఛ మీద ఉచ్చపోస్తాడేమో!!! భగత్ సింగ్ అలాంటివాళ్ళని చంపే హంతకుడవుతాడేమో!!! అయినా మనకి జంతువులతో బ్రతికే అర్హత లేదేమో???

కానీ ఇలాంటివి జరిగినప్పుడు… సంఘం కూడా ఎంతోకొంత బాగుచేయలేని మానభంగానికి గురవుతుంది. ఇదే కదా అస్సలు టాక్సిక్ హ్యుమానిటీ!!!

నిత్యజీవితాలలో ఇలాంటి సంఘటనలు భాగమవటం, వాటిని చూస్తూ ఊపిరి తీసుకోవటం అంటే.. జీవిస్తున్నామో బాధపడుతున్నామో గాయపడుతున్నామో లేక ఇలాంటి సంఘటనలు అల్లుకున్న జీవితాన్ని చూసే యావజ్జీవ శిక్షనే జీవితంగా అనుభవిస్తున్నామో అర్ధంకానీ దుస్థితి ఇది…

ఎంతో వేడి – చల్లని నీళ్ళని ఎన్ని గంటలు స్నానం చేసినా లాభం లేకపోయింది… మనస్సు నుండీ ఇలాంటి సంఘటనల జ్ఞాపకాలని కడిగేసే నీరు ఏ ఉమ్మనీరు లో ఉందొ… ఏ ఒడిలో ఉందొ… ఏ కోనేరులో ఉందొ… ఏ కాలువలో ఉందొ. పోనీ ఆ ఏనుగు ప్రాణంపోయేముందు వరకూ కార్చిన కన్నీరు అయినా – స్రవించిన దాని బిడ్డ రక్తం అయినా కడిగేయగలదా ఆ ఘటన నా మనసుకి అంటించిన మరకలని??? పోనీ దాని మూగఆత్మని ఓదార్చగలదా దాని కన్నీరయినా?!! బహుశా ప్రకృతి విపత్తు ఇలాంటి సంఘటనలని కడిగేసే శాశ్వత స్నానమేమో???

ఒక జాతిగా మనిషి తనకి తాను చేసుకునే ఇలాంటి గాయాలను కడగటానికే ప్రకతి తన విపత్తుముద్దులను పెడుతూ ఉంటుంది అనుకుంటా…

బిడ్డని కోల్పోయిన ఆ ఏనుగు ఆత్మ, సమస్త ఏనుగు జాతి మనల్ని పేరు పేరునా ప్రశ్నించకపోవచ్చు గాక, మనం మూగజీవులకి, ప్రకృతికి చేస్తున్న తరతరాల ఎడతెరపిలేని అన్యాయం నుండీ మరోసారి తప్పించుకోవచ్చుగాక… కానీ ఒకటి!!! ఇలాంటి సంఘటనలు ఎదురైనంత కాలం సంఘం… జాతి… మనస్సు… మానభంగానికి గురవుతూనే ఉంటాయి.

ఎన్ని శానిటైజెర్లు వాడినా కాలానికి, ప్రకృతికి అంటిన ఈ మరకలు పోవు.
రాబోయేది వినాయకచవితి, దీపావళి కాలం…. టపాకాయలు ఈసారి కూడా కాల్చబోతున్నాం… అప్పటికి ఎలాగో ఆ ఏనుగుని, దాని బొజ్జలో ఉన్న బిడ్డని దానిని బలిచేసిన ఆ మనుషులు, ఆహారంలో దాచిన టపాకాయలని మనం యధావిధిగా సునాయాసంగానే మర్చిపోతామేమోలే… ఏమంటావ్???

కానీ… ఇప్పుడు నువ్వు చదువుతున్న నా ఈ అక్షరాలకు, పదాలకి, నువ్ ఇప్పుడు ఖర్చుచేస్తున్న నీ కాలానికి, మధ్యమధ్యలో తీసుకుంటున్ననీ ఊపిరికీ కూడా ఆ ఏనుగుకి అయిన రక్తస్రావం తాలూకూ నెత్తుటిమరకలు అంటుకున్నాయి!!!
మనమందరం దానికి సజీవసాక్షులం!!!

—రచన : మోహన రామ్

1 COMMENT

  1. […] CHELIYA cinema flop antey naku ippatiki nammabuddi avvadhu….Nijamina love story oka abbayi katinamga untey ela untadi anna aspect lo nijanni chupichinandku flop chesara lepothey enduku flop ayindo eppatiki ardam kadu….RAVAN KADALI kuda alane flop anadam valla miss ayyanu kani RAVAN lo VIKRAM chupiche intensity and nijamga RAVANASURUDU SEETHADEVINI APAHARINCHUTA anna concept a naku mind lo run ayindi thappa…idem cinema ra anipivvaledu..kani emo okkokari taste okkola untadi…naku ayanante istam kabatti flop antey teskolepothunnanemo kani…CHELIYA FLOP ayana range ki nenu ah cinemani partlu partlu ga oka 30 40 Sarlu chusunta. […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Rumors of 90’s Kids Which we Believed as True

90's lo puttinavallaki rumour anevi chaala high icchevi, manam vinna rumour lu criticize chese antha telivi ledu appatlo, Basically avi rumour ani assalu idea...

Ala Vishakapatnam lo…

April 05 2005, Vishakapatnam ; India Vs Pakistan 2nd ODI Ganguly won the Toss And Choose to Bat... Sachin & Sehwag Opened the Innings... Early Overs loney Sachin Run...

IMPORTANCE OF AYURVEDA IN TODAY’S LIFE…

Ayurvedic medicine & treatment, gatha konni years ga most underrated treatment ani cheppochu.manamatha allopathy medicine adey common language lo cheppalantey english medicine ki baga...

Role of Criticism

Stupidity thrives across faiths, Invest in Rationality folks. this line makes a lot of sense to some when The National award-winning director Tharunbhasker has given...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak