Sunday, July 12, 2020
Home Articles ఆపదలో అక్కరకు రాని 'బాహుబలి'

ఆపదలో అక్కరకు రాని ‘బాహుబలి’

ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ కథ.

ప్రజలకు ఈ విశ్వం గురించి ఏ మాత్రం తెలియని కాలం అది. వాతావరణంలో జరిగే సాధారణ మార్పులకు సైతం భయపడి పారియే కాలం అది. ఎవరు ఏమిచెప్పినా గుడ్డిగా నమ్మే జనాల సమాజం అది. అలాంటి జనాల మధ్య… వారికంటే కొంచం తెలివి ఉన్న ఒకరు … ప్రజల భయాన్ని సొమ్ము చేసుకునే పిట్టకథలు చెప్పటం మొదలు పెట్టాడు. ”తానే ఈ విశ్వాన్నిసృష్టించానని … తాను చాలా శక్తి మంతుణ్ణని, ఓ సారి కోపం వచ్చి ఈ భూమిని చాపలా చుట్టి ఒంటి చేత్తో సముద్రంలో విసిరి పడేశానని… తాను తలచుకుంటే ఏమైనా చేయగలనని… తనను నమ్ముకుని పూజిస్తే మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని … ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటానని… అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తానని” జనాలను నమ్మబలికాడు.

జనాలు నమ్మారు, ప్రతిరోజూ అతను తన గురించి చెప్పుకునే కథలను వినటానికి వెళ్లేవారు. తమను కాపాడే గొప్ప ”బాహుబలి ” దొరికినందుకు సంతోషించారు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా చిటికలో తీర్చగలిగే దేవుడు తమవద్దకు వచ్చినందుకు పండుగ చేసుకున్నారు. తామంతా, ఆకులూ అలములూ ఆధారంగా కట్టుకున్న ఇళ్లలో ఉంటూ … పెద్దాయనకు మాత్రం గట్టి నివాసాన్ని ఏర్పాటు చేసి… అందులో అతన్ని పెట్టి పూజించటం మొదలు పెట్టారు. ప్రతిరోజూ వెళ్లి తమ కష్టాలు చెప్పుకుని, వాటిని తీర్చమని, కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి వేడుకోవటం మొదలుపెట్టారు. తన తెలివైన మాటలతో వారిని మభ్యపెట్టి, ఏమీ చేయకుండానే సంతోష పెట్టి పంపించేవాడు.

ఓ రోజు ఆకాశంలో ఆకస్మికంగా మార్పు వచ్చి సూర్యుడు కనిపించకుండా పోయాడు… భయపడిపోయిన జనాలు పరుగు పరుగున ”పెద్దాయన” ఇంటికి వెళ్లి ”అయ్యా! రోజు క్రమం తప్పకుండా వచ్చే సూర్యుణ్ణి ఎవరో కిడ్నాప్ చేసుకుపోయారు … మీరు సర్వశక్తి సంపన్నులు … మీకు సాధ్యం కానిది ఏమీ లేదు … మాకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటానని మాట ఇచ్చారు… మీరు వెంటనే వెళ్లి కిడ్నాపర్ల భరతం పట్టి … సూర్యుణ్ణి తీసుకొచ్చి మాకు ఇవ్వండి …” అంటూ వేడుకున్నారు. ఇది విన్న పెద్దాయన టక్కున తలుపులు మూసుకుని, భయంతో వణికిపోతూ ఇంట్లోనే కూర్చుండి పోయాడు. ఎదో విపత్తు వచ్చిపడిందని… తనను తాను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తూ ఇంట్లోనే ఓ మూల కూర్చుండి పోయారు.

ఇంట్లోకెళ్ళిన పెద్దాయన ఎంతకు బయటకు రాలేదు. లోపల ఏమిచేస్తున్నాడో కూడా ఎవరికీ తెలియదు. కానీ జనాలు, లోపల పెద్దాయన యుద్దానికి సిద్దమౌతున్నాడని … బయటకు వచ్చి తన ప్రతాపం చూపుతాడని ఎదురు చూడసాగారు. ఎంతసేపటికీ పెద్దాయన బయటకు రాలేదు … కానీ … కిడ్నాప్ అయిన సూర్యుడు కొంతసేపటి తరువాత బయటకు వచ్చాడు. జనాలు సంతోషం పట్టలేక చిందులేయసాగారు.

ఇంతలో … జనాల్లో ఉన్న కొందరు ”చూసారా…! పెద్దసారూ … లోపల ఏదో మంత్రం వేశారు … దెబ్బకు కిడ్నాపర్లు భయపడి … సూర్యుణ్ణి వదిలి పారిపోయారు” అన్నారు. మిగతా జనాలంతా పెద్దాయనకి జయజయ ధ్వానాలతో అరుపులు చేయటం మొదలుపెట్టారు. బయట ఇంత జరుగుతున్నా పెద్దాయన మాత్రం ఇంకా భయంతో లోపలే ఉండిపోయాడు. జయ జయ ధ్వానాల అరుపులు విని… బయట ఏదో జరుగుతుందని ఆయనకు అర్ధం అయ్యింది. ఏమిజరుగుతుందో చూద్దాం అని, ధైర్యం తెచ్చుకుని మెల్లగా బయటకు చూసాడు. ఎండ కనిపించింది… పైకి చూసాడు.. సూర్యుడు కనిపించాడు. ధైర్యంగా బయటకు వచ్చాడు.

జనాలు అమాంతం అతన్ని నెత్తిన పెట్టుకుని ఊరంతా తిప్పారు. సూర్యుణ్ణి కిడ్నాప్ చేసిన దుండగులను తరిమి కొట్టిన బాహుబలికి జిందాబాద్ …తన అపారమైన శక్తితో సూర్యుణ్ణి కాపాడిన లోక నాయకునికి బహు పరాక్. లోకాన్ని కంటి చూపుతో కాపాడగల ధీరునికి వందనాలు… అంటూ జనాలు పూనకంతో ఊగిపోయారు.

నాడు సూర్య గ్రహణాన్ని చూసి భయపడిపోయిన పెద్దాయనకు జనాలు కల్పించిన హోదా ‘దేవుడు ‘ అప్పటి నుంచి ఇప్పటివరకు యుగాలు గడిచాయి. సూర్యుడు లేక చంద్రుడు కనిపించకపోతే, అదే భయంతో అతని నివాసాలు మూచివేత, అదే సేఫ్టీ పద్దతి… అదే భక్త జనం… అదే నెత్తిన పెట్టుకోవటం… అదే వీర భక్తిని చాటుకోవటం.

గ్రహణానికి భయపడి దాక్కోవటం ఏమిటీ? అనే ప్రశ్న ఈ పెద్దాయన అనుచరులకు ఎప్పటికి వస్తుందో!

-మాదివాడ రామబ్రహ్మం, జన విజ్ఞాన వేదిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Rumors of 90’s Kids Which we Believed as True

90's lo puttinavallaki rumour anevi chaala high icchevi, manam vinna rumour lu criticize chese antha telivi ledu appatlo, Basically avi rumour ani assalu idea...

Ala Vishakapatnam lo…

April 05 2005, Vishakapatnam ; India Vs Pakistan 2nd ODI Ganguly won the Toss And Choose to Bat... Sachin & Sehwag Opened the Innings... Early Overs loney Sachin Run...

IMPORTANCE OF AYURVEDA IN TODAY’S LIFE…

Ayurvedic medicine & treatment, gatha konni years ga most underrated treatment ani cheppochu.manamatha allopathy medicine adey common language lo cheppalantey english medicine ki baga...

Role of Criticism

Stupidity thrives across faiths, Invest in Rationality folks. this line makes a lot of sense to some when The National award-winning director Tharunbhasker has given...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak