Saturday, October 24, 2020
Home Articles తెలుగు - గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ద్రవిడ భాషలలో ఒకటైన తెలుగు, ఉన్న నాలుగు ద్రవిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష. సుమారు ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది తెలుగు మాట్లాడతారు. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలోనే కాకుండా అగ్రరాజ్యం అయిన అమెరికాలోనూ తెలుగు భాష ఔన్నత్యం వేగంగా విస్తరిస్తోంది. అమెరికానే కాకుండా వివిధ దేశాలలోనూ తెలుగు భాష గొప్పతనం గణనీయంగా పెరుగుతోంది.

భాషా మాధుర్యంలోనూ, పద లాలిత్యంలోనూ, భావ గాంభీర్యంలోనూ తెలుగు ఎంతో అసమానమైనది అని శ్రీకృష్ణ దేవరాయలు వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష తెలుగు. నాటి ఆదికవి నన్నయ దగ్గర నుండి నేటి ఆధునిక కవులు తెలుగును ఎంతగానో సుసంపన్నంగా తీర్చిదిద్దారు. గ్రాంధికం గా ఉన్న సాహిత్యాన్ని, విద్యాబోధనని వ్యావహారికంగా మార్చిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకు గాను ప్రతియేటా ఆగష్టు 29వ తారీఖున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం.

మన తెలుగు భాషలో ఎక్కువ పదాలు అచ్చులతోనే అంతమవుతయి అందుకే తెలుగుని అజంతా భాష అని కూడా అంటారు. మన భారతదేశ రాజులే కాకుండా ఇటలీ రాజులు మన భాషను “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని అంటారు దానికి కారణం వారి భాషలో కూడా పదాలు అచ్చులతోనే అంతమవుతాయి కాబట్టి. అన్ని భాషలలో కంటే మన తెలుగు భాషలోనే జాతీయులు,సామెతలు ఎక్కువ.

ఇంత మహత్తరమైన తెలుగు భాషని మనం ఇంకా మార్కులుగానే చూస్తున్నాం. నాలుగు మార్కులు వస్తే పరీక్ష చెల్లిపోతుంది అనే భావనలోనే మనం ఉన్నాం. పరభాష లో పాటలు వింటేనే మనం గొప్ప, పరభాష సినిమాలు చూస్తేనే మనం గొప్ప అనే ధోరణి పోయి మన భాష సినిమాలు, మన భాష పాటలు అందులో ఉండే మాధుర్యాన్ని గుర్తించగలగాలి. మన భాష మనకి ఎంత దూరం అవుతోంది అంటే UNESCO ప్రకారం అంతరించిపోతున్న భాషలలో తెలుగు కూడా ఒకటి, అంతటి దుస్థితి మన తెలుగుకి వచ్చింది. ఇకనుంచి అయిన పిల్లలకు తెలుగు భాష మీద మమకారం పెంచాలి. తెలుగు ఔన్నత్యాన్ని ఒక పాఠంగా ప్రవేశ పెట్టాలి. తెలుగు గ్రంధాలయాలు ఏర్పాటు చేయాలి. తల్లి తరువాత తల్లి లాంటిది మన మాతృభాష, అలాంటి మాతృభాషను మనం దూరం చేసుకోకూడదు కదా. పర భాష వ్యామోహంలో పడి మన భాషని గాలికి వదిలేయకుండా మన భాషని సజీవంగా ఉంచుకుని, నిత్యనూతనంగా దానిని మలిచి మన రేపటి తరానికి అందించడం మనందరి బాధ్యత. తెలుగు యొక్క వెలుగు నలుమూలల కాంతిమయం అయ్యేలా చేయాలి. తేనెలొలుకు భాష తెలుగు, అమ్మతనం నిండిన భాష తెలుగు…

– An article by Datta Sairam

website
News
coffee in a chai cup
News
coffee in a chai cup
coffee-in-a-chai-cup
ccc
Publisher Name
Coffee in a Chai Cup

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Nostalgic Short Films every short film lover can relate to…

Manakai chala chinni crazy ideas osthuntai , kani anni pedha films kalevu .Oka idea practical form loki ravalante chala pattudhala hard work kavali ,...

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు - గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్ తెలుగు, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ద్రవిడ భాషలలో ఒకటైన తెలుగు, ఉన్న నాలుగు ద్రవిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష....

10 underrated places that define the vibe of Hyderabad

Some random Person: abba Hyderabad overrated ra sami , a Charminar , Tank bund , Golconda danni pattukuni m Hyderabad goppa ante ma Hyderabad...

Nisheedi Mounam Aksharamaithe

Jeevitham tho Mounam ga Yuddam chesthunna oh, Manishi Manasu Katha... Manam chudaley kani Mana chuttu unna Manam chudaleni Yuddam chesthunna chala Mandi Manushula Manasuloni katha...   'Ah Nidra Rani Artha...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak
website
News
coffee in a chai cup
News
coffee in a chai cup
coffee-in-a-chai-cup
ccc
Publisher Name
Coffee in a Chai Cup